Manavata flood relief work in Bhadrachalam area
విశ్వ మానవతా సంస్థ
ఆధ్వర్యంలో గోదావరి వరదల కారణంగా పూర్తిగా నీట మునిగి పోయిన వారికి భరోసాగా నిత్యావసర వస్తువుల పంపిణీ.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రా0లో గోదావరి వరదల ద్వారా అనేక ఏజెన్సీ ప్రాంతాలు ముంపులో చిక్కుకున్నాయని అనేక రోజులుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఎల్లవేళలా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా అనేక సేవా కార్యక్రమాలు గత 30 సంవత్సరాల నుండి నిర్వహిస్తూ వస్తూ ఉన్నది .
ప్రకృతిని కాపాడడం ప్లాస్టిక్ నివారణ సేంద్రియ వ్యవసాయం యోగ వంటి విద్య పై కార్యక్రమాల ద్వారా సమాజాన్ని చైతన్య వంతం చేస్తూ ఉన్నది.
ఈ సంవత్సరం సంభవించిన గోదావరి వరదల కారణంగా ఇబ్బంది పడుతున్న కొన్ని గ్రామాలలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు మరియు చిన్న పిల్లలకి పౌష్టిక ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో .
ఇందులో భాగంగా ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలం వీరాయిగూడెం గ్రామం లో సుమారు 120 మందికి ఈ వస్తువులు వితరణ చేయటం జరిగింది.
ఈ కార్యక్రమంలో సంస్థ సేవకుడు మరియు ఆదివాసి రాష్ట్ర నాయకులు సోయం కన్నారాజు మరియు గ్రామ సర్పంచ్ గ్రామ పెద్దలు పాల్గొని సామగ్రిని వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు *విశ్వమానవతా సంస్థ స్థాపకులు అల్లూరి శ్రీనివాస్ చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేసారు.