vishwa manavata vidya kendra Narsapur center
విశ్వ మానవత విద్యా కేంద్రం నర్సాపూర్ సెంటర్లో ఈరోజు గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ మాజీ సర్పంచు గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రుల గ్రామ యువకుల సమక్షంలో విశ్వ మానవత విద్యా కేంద్రం కమిటీ వేయడం జరిగింది ఈ కమిటీలో సభ్యులుగా కొమ్మూరు ఈరప్ప గ్రామ సర్పంచ్ యశోద నర్సింలు ,ఉపసర్పంచ్్ ,చిన్న నరసప్ప మాజీ సర్పంచ్ కావాలి వెంకటప్ప, జైపాల్ రెడ్డి ,కావలిశివకుమార్ ,అంజయ్య గౌడ్ యూత్ మెంబర్లుగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో విశ్వ మానవత విద్యా కేంద్రం ఉపాధ్యాయులు హనుమంతు ,జిల్లా కోఆర్డినేటర్ వెంకటేష్, మరియు గ్రామ యువకులు ,గ్రామ పెద్దలు,విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది .ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ సర్పంచ్ విశ్వ మానవత విద్యా కేంద్రం ఇంత చక్కటి విద్య బోధను అందిస్తున్న అల్లూరిశ్రీనివాస్ సార్ గారు మన మానవత విద్య కేంద్రం వ్యవస్థాపకులు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పి గ్రామ సర్పంచ్ తెలియజేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో చాలా అరుదుగా ఉంటాయి వారి యొక్క జీవితాన్ని ఈ సంస్థకు కు కేటాయించారు కాబట్టి వారికి మనం ఎంతో రుణపడి ఉండాలి మీరు మంచి విద్య నేర్చుకుని క్రమశిక్షణతో మెలిగి మీ యొక్క తల్లిదండ్రులకు మానవత విద్యా కేంద్రం సంస్థకు మంచి పేరు తీసుకొస్తారని నా వంతు సహకా సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని సర్పంచ్ గారు హర్షం చేయడం జరిగింది