MAHE Summer Camp in Endada Village ZPH school (Vizag)
పునాది పటిష్టంగా ఉంటే దానిపై నిర్మించిన భవంతి కూడా పతిష్టంగానే ఉంటుంది.దృఢమైన ఘనమైన శక్తివంతమయి సౌర్యవంతమైన భారతావని నిర్మించాలంటే పటిష్టమైన విద్యావిధానం అవసరం మానవత-వైజాగ్ తన పంచ అంగాలయిన విద్య,వైద్యం,ప్రక్రుతి,సేంద్రియ విధానం,బాలిక రక్షణ లలో మొదటిది చివరిది అత్యంత అవశ్యంగా స్వీకరించింది. A for Apple స్థాయి నుంచి Apple లో ఫోషక విలువలు ఏంటి,ఖరీదు యెంత,ప్రత్యాయామ్న ఫలం ఏది? పండించగలమా? సేంద్రియ విధానంలో పండిస్తే లాభాలు…వంటి ప్రశ్నలు జనింప జేసేది విద్య.
అటువంటి విద్యను పరిచయం చేయటంలో తోలి అడుగు ఈ మానవత-వైజాగ్ వేసవి శిక్షణా శిబిరం 2017 మా నమ్మకం ఎన్నడూ వమ్ము కాలేదు.బాలికలు సదా అపర సరస్వతులే.ఈ వేసవి శిక్షణా శిబిరంలో బాలురకంటే బాలికలే ఎక్కువగా పాల్గొన్నారు…బహుమతులు కూడా వారే హెచ్చుగా గెలుచుకున్నారుబాలికా విజయంతోనే మా నివేదిక మొదలై బాలికల చిరునవ్వుల మధ్య మా శిబిరం ముగుస్తుంది.ఈ ఐదు రోజుల శిబిరాన్ని నడిపించింది కూడా వనితలే అని సగర్వంగా చెప్పటానికి మానవత-వైజాగ్ సంతసిస్తున్నది *శ్రీమతి కోసూరు ఉమాకుమారి, శ్రీమతి సరిత పట్నాయక్,కుమారి స్వాతి బలివాడ ముగ్గురు ఆది పరాశక్తికి ప్రతిరుపాలా అన్నట్లు విరామం ఏరుగక గత ఐదు రోజులు సేవలందించారు.వారి సన్నిధిలో బాలికలు గువ్వల్లా మారి వెలుగు పువ్వుల్లా వికాశించారంటే ఆగొప్పదనం పూర్తిగా ఆ స్త్రిమూర్తులదే.శ్రీమతి కోసూరు ఉమాకుమారి గారు ఉత్తమ గృహిణి,భర్త రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసి సొంత వ్యాపారం చేస్తున్నారు.వీరికి ఇరువురు సంతానం.ఇద్దరు కుమార్తెలకు వివాహమయింది.వారు విద్యావంతులు.సాధారణ గృహిణి ఆలోచనలకు భిన్నంగా ఆలోచించి శ్రీమతి ఉమాకుమారి సమాజం కోసం కొంత సమయం వేచిస్తుంటారు.ఈమె నిత్య విద్యార్థిని. కౌన్సిలింగ్ చేయటంలో,ప్రేమగా లాలించటంలో అందే వేసిన చేయి.శ్రీమతి సరితా పట్నాయక్ రామకృష్ణా మఠ్ సభ్యురాలు.సాధారణ జీవితం గడపటం,నిరాడంబరత,సేవ, ఈమెకు జన్మతః వచ్చిన సుగుణాలు.ఒక్క రోజు వచ్చినా అందరి పిల్లల మదిని దోచుకున్నారు.కుమారి స్వాతి బలివాడ సంస్కృతంలో డిగ్రీ చేసారు,డిప్లమో ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ సైకాలజీ చదివారు.చిత్రలేఖనంలో జాతీయ స్థాయిలో బహుమతులు అందుకున్నారు.బోధన అంటే మక్కువ ఉండటం వల్ల ప్రైమరీ విద్యలో ప్రావీణ్యం వెరసి బాలబాలికలకు ఒక స్నేహితురాల్లా మారిపోయి వారిలో కలసి తన తోవకు రప్పించుకున్నారు.వీరితోపాటుగా ఐదు రోజుల శిబిరంలో బలివాడ వెంకట్ పట్నాయక్,చిన్నా రావు బలగ పాల్గొన్నారు.ఇండియా యూత్ ఫర్ సొసైటీ సభ్యులు అప్పల రెడ్డి బృందం నాల్గవ రోజు సెషన్లో పాల్గొని వేసవిలో పక్షుల సంరక్షణ వివరించి మట్టి దా కలు, తిండి గింజలు, సంచులను అందించారు.
ప్రారంభ దినం: సెషన్-1:-జాతీయ గీతాలాపనతో మొదలయిన శిబిరం పరిచయాలతో ముందుకు సాగి బాల బాలికల అభిరుచులు ఇష్టాయిష్టాలు,ఇబ్బందులు,తల్లిదండ్రుల ఆర్ధిక స్థితిగతులు,వారి వృత్తి వ్యాపారాలు, వంటివి తెలుసుకోవటం జరిగింది.అవరోధాలు అనేవి శత్రువులు కావని మనలను మరంతగా దృఢపరిచేందుకు ప్రకృతి నియమించిన మిత్రులని వివరించటం జరిగింది.వాటిని చూసి జడిసి ముందుకు వెళ్ళకుంటే ప్రకృతిని విస్మరించినట్లేనని చెప్పటం జరిగింది.ఎడారిలో చిన్ని మొక్క అననుకూల పరిస్థితుల్లో అతి వేడిమి,తెమలేని ఇసుకలో జీవించి పచ్చగా వికసించి పూలు పూస్తుంది.ఆ చిన్ని మొక్కను ఒంటె తినేస్తుంది.ఇసుక తుఫాన్ కప్పేస్తుంది.అయినప్పటికీ ఇసుక రేణువులను చీల్చుకుని ఉదయాన్ని చూస్తుంది అననుకూల పరిస్థితులు మనలను రాటు దెలుస్తాయి స్వామీ వివేకానంద నిత్యం అదే చెబుతారు…సాగిపోతుందండి…నిత్యం కదులుతూ ఉండండి…శిలలా మాత్రం మారవద్దు.ఎందుకంటె గమన రహిత జీవితం చావుకన్నా హీనమయినది. బలము, బలహీనతలు రెండు జీవితంలో రెండు పార్శ్వాలు.నాణెం స్థితినుంచి జీవితాన్ని గోళంగా మార్చికుని మంచి అలవాట్లు చెంత చేర్చుకుంటే చెడు సంగత్యాలు దూరంగా జరిగిపోతాయి.ప్రభాత కాలంలో నిద్ర లేవటం నుంచి పెందలాడనే పక్కపైకి చేరటం వరకు గల ప్రయోజనాలు,మిత ఆహరం సాత్విక ఆహరం, వలన ఉపయోగాలు వివరించటం జరిగింది.